మనం తీసుకొనే ఆహారం మన చర్మ సౌందర్యం పైన ప్రతిఫలిస్తుంది అని చెపుతున్నారు పరిశోధికులు. విటమిన్-ఎ అధికంగా ఉండే ఆహారం తీసుకొంటే చర్మం కూడా ఎ క్లాస్ గానే  ఉంటుందంటున్నారు. క్యారెట్లు, పాలకూర, మెంతికూర, బచ్చలి వంటి ఆకుకూరలు గుమ్మడి, కోడిగుడ్డు లోని పచ్చసొన, చేపలు తీసుకొంటే శరీరానికి తగినంత విటమిన్-ఎ లభిస్తుంది. తద్వారా చక్కని చర్మం సొంతం చేసుకోవచ్చు అంటున్నారు పరిశోధికులు.

Leave a comment