ఎప్పుడో 1200 ఏళ్ళ క్రితం రబ్బర్ చెట్ల నుంచి తీసిన మెటీరియల్ తో వాటర్ప్రూఫ్ గార్మెంట్స్ తయారు చేశారు. అవి కాస్తా ఇప్పుడు అసలైన దుస్తుల కంటే నాజూగ్గా తయారై ఫ్యాషన్ పోకడలు పోతున్నాయి. లాంగ్ రైన్ కోట్ తీసుకుంటే ప్యాంట్, షర్ట్ కుర్తి శారీ ఏదైనా అందంగా కనిపిస్తుంది. చిరుజల్లుల్లో నడిచేందుకు చక్కని ఎంపిక నడుము దగ్గర బెల్ట్ లాగా ఉండే ఫిషర్ మాన్ కోట్ స్టైలిష్ గా ఉంటుంది. వెయిస్ట్  లెంగ్స్ రెయిన్ కోట్ జీన్స్ ప్యాంట్, స్కర్ట్ వంటి కొన్ని డ్రెస్ స్టయిల్స్ కి చక్కగా నప్పుతుంది. ఎంతో ఫ్యాషనబుల్ గా అనిపించే ట్రాన్స్ పరెంట్ రెట్రో స్టయిల్ పాంబోస్, షర్ట్ అండ్ స్కర్ట్ కుర్తీ స్టయిల్ వంటి విభిన్న మోడల్ రైన్ కోట్స్ మార్కెట్ లో పలకరిస్తున్నాయి.

Leave a comment