మై ఆన్ ఎర్త్ పేరుతో సంస్థను స్థాపించి ఒక ఏడాది లోగానే 50 లక్షల టర్నోవర్ సాధించింది నిఖియా సంఖియా. కొబ్బరి పీచుతో కొబ్బరి పెంకులకు వెదురు జోడించి వంటింట్లో ఉపయోగపడే వస్తువుల నుంచి ఫ్యాషన్ హోమ్ డెకర్, ట్రావెల్, పర్సనల్ కేర్, స్టేషనరీ వస్తువులు తయారు చేసి అందిస్తోంది నితిక. కొబ్బరి పెంకులతో కిటికీ గృహోపకరణాలు వెదురుతో టూత్ బ్రష్ లు తయారు చేస్తోంది. ఆమె చేసే వస్తువులకు స్వదేశంలోనే కాకుండా అంతర్జాతీయంగా ఎంతో గిరాకీ ఉంది జైపూర్ లోని స్థానిక మహిళలకు ఉపాధి చూపిస్తున్న ఒక స్వచ్ఛంద సంస్థతో కలిసి నితిక పనిచేస్తుంది. మా వస్తువులు ప్రకృతి సిద్ధమైనవి వాటి తయారీ ఎంతో సున్నితంగా ఉంటుంది ఇలాంటి కళాత్మక వస్తువులు చేతితో తయారు చేయవలసినవి కనుక కాస్త ధర ఎక్కువే కానీ భవిష్యత్తు మాత్రం పర్యావరణ హితమైన వస్తువులదే అంటుంది నిఖియా సంఖియా.
Categories