భూయిరా జామ్ ఫ్యాక్టరీ స్థాపించారు బ్రిటిష్ ఇండియన్ లినెట్. కాశ్మీర్ కు చెందిన వ్యక్తిని పెళ్లి చేసుకుని హిమాచల్ ప్రదేశ్ లో స్థిరపడ్డారు లినెట్. అక్కడ అధికంగా ఉండే ఆప్రికాట్ పీచ్, యపిల్, కివి పండ్ల తో జామ్ తయారు చేసేవారు. రసాయనాలు వాడకుండా యాపిల్ జ్యూస్ పంచదార వినియోగించి లినెట్ తయారుచేసే జామ్ ల రుచి అందరికీ నచ్చాయి. 76 టన్నుల పండ్లతో 48 రకాల పండ్లు తయారుచేస్తున్నారు. రోజుకి ఆ ఫ్యాక్టరీలో 850 జామ్ బాటిల్స్ తయారవుతాయి. కోట్ల రూపాయల ఆదాయంతో పాటు వందల మందికి ఉపాధి కల్పిస్తోంది భూయిరా జామ్ ఫ్యాక్టరీ.