Categories
శరీరానికి మేలు చేసే అవిసె గింజలను తినాల్సిన పద్ధతిలో తినాలి అంటారు ఎక్సపర్ట్స్. అవిసె గింజల్లో మహిళలకు అవసరమైన ఈస్ట్రోజన్ యాంటీ ఆక్సిడెంట్స్ కలిసి ఉంటాయి. ఒమేగా-3, పీచు పుష్కలంగా ఉంటుంది. రోజు వీటిని తినాలి అంటే అర టీ స్పూన్ తో మొదలు పెట్టాలి ఏ అలర్జీలు రాకపోతే వీటిని ఓ చెంచా వరకు తినచ్చు. పచ్చిగా తినడం కన్నా డ్రై రోస్ట్ చేసి పొడి చేసి తినాలి. ఈ గింజలు నీళ్ళలో వేస్తే జెల్లీలా అవుతాయి.దానర్ధం నీళ్ళను ఎక్కువగా గ్రహిస్తాయన్నమాట. అందుకే వీటిని తింటూ ఉంటే మంచి నీళ్లు ఎక్కువ తాగాలి లేకపోతే, మలబద్ధకం వస్తుంది.