మనుషుల్లో వుండే నిజాయతీకి నిదర్శనం ఈ ఊరి షాపులు. మిజోరాం లోని సెలింగ్ పట్టణం లో ఉన్న ఈ హైవే మార్గంలో కొండలు అడవులు వరి పంటలే కనిపిస్తాయి. ఆ దార్లో అక్కడక్కడా కూరగాయలు పండ్లు. పండ్ల రసాల బాటిల్ తో పాటు ఇతర అటవీ ఉత్పత్తులను అమ్మే చిన్న దుకాణాలు ఉంటాయి.కానీ ఆ షాపుల్లోఅమ్మే వాళ్ళు ఎవ్వరూ కనిపించరు అన్ని వస్తువుల పైన వాటి ధర ఒక అట్టముక్క పైన రాసి ఉంటుంది. వాహనాల్లో అటు వైపు వెళ్లే వాళ్లు ఆ దుకాణాలు దగ్గర ఆగి కావలసినవి తీసుకొని ధర ఎంతయితే అంత ఆ పక్కనే ఉన్న డబ్బాలో పెట్టి వెళతారు సరైన చిల్లర ఆ డబ్బా లో నుంచి చిల్లర ఎంచి తీసుకొంటారు. అక్కడి రైతులు అడవిలో కొండల్లో ఆయా కాలాల్లో దొరికే అటవీ ఉత్పత్తులను సేకరించి వీటిని రోడ్డుపక్కనచెక్క బల్ల పైనఅమ్మకానికి పెట్టి పొలాల్లో పనులు చేసుకునేందుకు వెళ్తారు. సాయంత్రం పని ముగించుకుని వెళుతూ డబ్బాలో వేసిన డబ్బు తీసుకుంటారు. ఈ ప్రాంతం పట్టణానికి 60 70 కిలోమీటర్ల దూరం లో ఉంటుంది కనుక తమ ఉత్పత్తులను అంత దూరం తీసుకుపోయి అమ్ముకో లేరు వాటి కోసం రోజంతా ఆ షాపుల్లో కూర్చోనూలేరు అందుకే ఈ పద్ధతిని ఎంచుకున్నారు. మనుషుల నిజాయితీ పై నమ్మకం ఉంచి ప్రారంభించిన ఈ పని కొనసాగుతూనే ఉంది ఇప్పటివరకు డబ్బులు వేయకుండా ఎవరు ఏ వస్తువు తీసుకు పోనేలేదట !
Categories