కొత్తగా పెళ్ళయిన దంపతులు ఒక కొత్త వాతావరణంలో సర్ధుకు పోయేందుకు కాస్త సమయం తీసుకొంటుంది. చిన్న చిన్న విషయాల్లో అభిప్రాయ బేధాలు వస్తే రావచ్చు. కలహాలు లేని కాపురాలు ఉండవు. ప్రతి ఒక చిన్నదానికి భాగస్వామితో గొడవలు పడకుండా,ప్రతిదీ సాగదీసి అదేపనిగా వాదనలకు దిగకుండా ఉండాలంటున్నారు ఎక్స్ పర్ట్స్. ఒకళ్ళు కోపంగా వుంటే ఇంకోళ్ళు మౌనం పాటించాలి. కాసేపయ్యాక ఆ కోపాలు తగ్గాక సామరస్యంగా మాట్లాడుకోవచ్చు . సమస్యను చర్చించాలి తప్ప వాదనలు వద్దు . పంతం నెగ్గించుకోవాలని చేసే ప్రయత్నాలు సమస్యలు జథిలం చేస్తాయి. జీవితాన్ని సంతోషమయం చేసుకోవటం మన చేతుల్లోనే ఉంటుంది.

Leave a comment