
నలభై చిత్రాలకు పైగా పని చేసిన మహిళా కాస్టింగ్ డైరెక్టర్ పుష్ప భాస్కర్ ఈ వృత్తిలోకి ఇంకా ఎక్కువ మంది మహిళలు రావాలని చెబుతారు. సినిమాకు సంబంధించిన 24 క్రాఫ్టుల్లో ‘కాస్టింగ్ డైరక్టర్’ పదమే లేదు.దాన్ని దర్శకత్వంలో భాగం అనుకుంటారు కానీ ఈ ప్రొఫెషన్ చాలా ప్రత్యేకం అంటారు పుష్ప ఎనిమిది సంవత్సరాల క్రితం ఇక్కడ ఇలాంటి వ్యవస్థ లేదు. ఇప్పుడు అవకాశాలు వచ్చాయి ‘పోస్ పోరీస్’ వెబ్ సిరీస్‌తో నాకు పేరొచ్చింది. ఇప్పటికీ 15 వెబ్ సిరీస్ కాస్టింగ్ డైరెక్టర్ గా పని చేశాను. నలభై సినిమాలు పూర్తి చేశాను. ఈ వృత్తిలోకి మహిళలు వస్తేనే ఎంతో మందికి కొత్త అవకాశాలు వస్తాయి అంటారు పుష్ప భాస్కర్.