Categories
‘మిమి’ పాత్ర కోసం ఏకంగా పది కిలోలు బరువు పెరగావలసి వచ్చింది. దీన్ని గురించి ఎంతో ఆలోచించాను. క్యాలరీలు లెక్క పెట్టుకొంటు ఆహారం తీసుకోవలసివస్తోంది. ఇలా బరువు పెరగవలసి రావటం నాకు ఛాలెంజ్ గా అనిపిస్తోంది అంటోంది కృతిసనన్. బరువు పెరగటం వెంటవెంటనే ఆ బరువును కంట్రోల్ చేసుకోవటం అంత తేలికైన విషయం కాదు. ఎన్నో ఆహారపు అలవాటు మార్చుకోవాలి జీర్ణ వ్యవస్థకు ఇబ్బంది కలగకుండా చూసుకోవాలి. కానీ శరీరాన్ని మరీ ఇంత అదుపులో ఉంచుకోవటం అంటే మనసుని ఆలోచనని క్రమశిక్షణ లో ఉంచుకోవాలి పెరుగుతున్న బరువుని వెంటనే తగ్గించుకోవలసిన అంశాన్ని గుర్తు చేసుకొంటూఉంటాను. కానీ ఈ సారి నేను ఎలా కనిపిస్తానో అన్న ఉత్సాహం కొద్దీ ఈ కష్టాన్ని ఆస్వాదిస్తున్నాను అంటోంది కృతిసనన్.