కొన్ని పనులు చేసేందుకు చాలా పెద్ద మనసు కావాలి. లగాన్,దంగల్,త్రీ ఇడియట్స్ వంటి సూపర్ డూపర్ సినిమాలతో ప్రపంచ వ్యాప్త అభిమానులను సంపాదించుకొన్న అమీర్ ఖాన్ కూతురు ఇరా ఖాన్. అగట్స్ పేరుతో రిజిస్టర్ చేసిన మెంటల్ హెల్త్ ఫౌండేషన్ గురించి ప్రకటించింది. అందరికీ చిన్నవో, పెద్దవో సమస్యలుంటాయి. వాటికి పరిష్కారాలు తెలిస్తే సుఖంగా ఉండొచ్చు ఒంటరితనం తగ్గుతోంది. ఇష్టమైన వ్యాపారాలతో నచ్చిన రీతిలో సంతోషంగా బ్రతకచ్చు. మానసిక ఆరోగ్యం గురించి అవగాహన కల్పించి సమస్యలను పరిష్కరించేందుకు మీకు తోడుగా కూడా ఉంటుంది అంటోంది ఇరా ఖాన్ అగట్స్ అనేది జపనీస్ పదం దాని అర్థం సిసలైన విజయం, స్వీయ నైపుణ్యం ఈ పేరు వచ్చింది అసలు ఏ మానసిక ఆరోగ్య కేంద్రం ఆలోచన నాకెంతో నచ్చింది. నాకు నటన అంటే ఇష్టం లేదు టెక్నీషియన్ గా ఉందామనుకున్నాను. టాటూలు వేయడం కూడా ఇష్టం అలా నా చేతి పైన ఈ పని మనమే చేయకపోతే ఇంకెవరుచేస్తాము  అని అర్థం వచ్చేట్టు నేనే స్వయంగా వేసుకున్నాను దాని వైపు చూస్తూ ఉంటే నేనేం చేస్తే బాగుంటుందో నాకు ఆలోచన వచ్చింది అందుకే ఈ అగట్స్ ఎన్జీవో. ఇది తొలి అడుగు. ఇంకా ఎన్నో చేయాలనుకొన్నాను అంటుంది ఇరా ఖాన్.

Leave a comment