కళాకారుడికి కళ్ళకు చేతులకు అసాధ్యాలు అంటూ లేవు. వాళ్ళ వేళ్ళ చివరిలో మాజిక్ ఉంటుంది. చూపరులను విభ్రాంతులను చేస్తుంది. కొన్ని వస్తువులు అలాగే ఉంటాయి సీసా మూతి చూస్తే చిన్నది. దాని కడుపులో పెద్ద ఓడ కనిపిస్తూ ఉంటుంది. అలాగే చిన్ని మూతి సీసాల్లో భవంతులు,పచ్చని కొండలూ రైలు పట్టాలు, ఇళ్ళూ వంతెనలూ కనిపిస్తాయి. వాటిని లోపల ఎలా దూర్చారో అర్ధం కాదు. సీసాలూ నిజమే అందులో ఉన్న ఓడలూ ఇళ్ళు చేసినవే. కొందరు కళాకారులు ఈ బొమ్మల్ని బయటే తయారు చేస్తారు. కొన్నింటిని మడిచి అందులో దూరుస్తారు లేదా విడి భాగాలు చేసి సీసాలోనే ఆ ముక్కల్ని కలిపేసి వస్తువులుగా మార్చేస్తారు. చిన్న కర్ర పుల్లలూ,కాగితాలు అట్టముక్కలతో లోపల పెట్టదలుచుకొన్న వాటిని అత్యంత సూక్ష్మంగా అవి విరిగిపోకుండా కాయితాన్ని మడిచినట్లు మడిచి లోపల   దూర్చాక సన్నటి పుల్లతో విడదీస్తారు.కొండల్ని,మొక్కల్ని విడివిడిగా చేసి వెడల్పాటి సూదులు ఫోర్ సెప్స్ తో ఒక్కదాన్ని లోపల అంటిస్తూ దృశ్యకావ్యంలాగా మలిచేస్తారు. ఎన్ని సార్లు చుసిన ఆశ్చర్య పరిచే బొమ్మలివి. ఇవి ఎలా చేయచ్చో చూపించే వీడియోలు కూడా ఎన్నో దొరుకుతాయి. చుడండి.

Leave a comment