మీ నవ్వు ఏ రంగులో ఉండాలి /నీలం ఆకుపచ్చ ,బంగారు ,పింక్,వెండి రంగుల్లో ఏది ఎంచుకొంటారు ?అని అడుగుతున్నారు అమెరికాకు చెందిన క్రోమ్ బ్యూటీ సంస్థ వాళ్ళు . రెయిన్ బో పేరిట టూత్ పాలిష్ లు తాయారు చేసారు . ఇవి రుద్దుకొంటే పళ్ళమిలమిళ తెల్లగా మెరిసి పోతాయి అనుకొంటే పొరపాటే గోళ్లకు నెయిల్ పాలిష్ లాగా పళ్లకు పాలీషు అన్నమాట. ఈ దంతాలకు వేసుకొనే టూత్ పాలిష్ డ్రస్ ,హెయిర్ కలర్ ,లిప్ స్టిక్ కి తగ్గట్టుగా మాచింగ్  గా వేసుకోవాలి . కొత్తగా ఏ ఫ్యాషన్ వచ్చిన ట్రెండ్ అయినట్లే ఈ పళ్ళకు వేసుకొనే టూత్ పాలిష్ ఇప్పుడు అమ్మాయిలకు నచ్చేసింది .

Leave a comment