విజేతలు ఎప్పుడూ ఎవరూ చేయని కొత్త పనులు చేయరు. కానీ చేసే పనినే కొత్తగా చేస్తారని అంటారు రచయిత. జమైకా క్రీడాకారుడు ఉసేన్ బోల్ట్ 100 మీటర్ల పరుగులు తన ప్రత్యర్థుల కంటే ఒకటి రెండు సెకన్లే ముందంటాడట చివరి స్థాయిలో ఎవరు అత్యున్నత ప్రదర్శన ప్రదర్శించారన్నదే ఆటలో విజయానికి కీలకం ప్రపంచంలో విజేతలైన వారు ఎప్పుడూ ఇలాటి ప్రత్యేకతనే కనబరిచారు ఒక లక్ష్యాన్ని ఒక పనిని ఎంచుకొని దాన్ని విభిన్నంగా వినూత్నంగా చేయటమే విజయం విద్యార్థులకు యువకులకు ఇదే ఆదర్శం కావాలి ఒక స్వల్ప కాలాక లక్ష్యం పెట్టుకుని తప్పులు జరిగిన, నిరాశ కలిగిన ఓటమి ఎదురౌతున్న అధైర్య పడకుండా ముందుకు సాగి విజయం సాధించాలి కష్టపడి,ఒర్చుకొంటే కీలకమైన మలుపు దగ్గర మరింత శ్రద్ధగా శ్రమిస్తే విజయం సొంతం అవుతుంది.
చేబ్రోలు శ్యామసుందర్
9849524134