ప్రముఖ ఫ్యాషన్ మ్యాగజైన్ వోగ్ ఇటాలియా తాజా సంచిక కవర్ పేజీగా ఆదివాసీ మహిళా సీత వాసునియా ఫోటో కనిపించింది ఆమె ధరించిన చీర ఆమె నేసినది సాదాసీదాగా ఉన్న ఆ చీరె ఇప్పుడు ఫ్యాషన్ ప్రపంచంలో కొత్త షోకేస్ డిజైన్ గా మారింది మండు లో ఫ్యాబ్రిక్ పెయింటింగ్ భాగ్ ప్రింట్ లో శిక్షణ తీసుకుంటున్నారు ఏక్ జిల్లా ఏక్ ఉత్పాడ్ పథకంలో భాగంగా ఒక పది మంది మహిళలు వాళ్ళలో ఒకరు సీత వాసునియా ఆదివాసీ కట్టుకున్న చీరె కట్టుకు అత్యాధునికత ఒక కెమెరామెన్ కళ్ళల్లో పడింది మందు లోని రాణి రూపమతి మహల్ మ్యూజియం లో ఫోటో షూట్ చేశాడు అతను మార్చి సంచికలో ఆ ఫోటో వోగ్ పత్రిక కవర్ పేజీ గా వచ్చింది మొత్తం ఆ ప్రాంతంలోని చేనేత చీరెలు అన్నిటికీ ఎక్కడలేని ప్రాచుర్యం వచ్చేసింది.