కొన్ని కూరగాయలు పండ్లు పై తొక్క తీయకుండానే తింటే పోషకాలను నష్టపోకుండా ఉంటాము అంటున్నారు నిపుణులు.సలాడ్ కోసం ఉపయోగించే జుకిని తొక్కలో యాంటీ ఆక్సిడెంట్స్, పీచు పుష్కలంగా ఉన్నాయి. దీన్ని నేరుగా వాడుకోవచ్చు పియర్స్,యాపిల్ లో యాంటీ ఆక్సిడెంట్స్ చాలా ఎక్కువ క్యారెట్లు బంగాళదుంపల్లో వాటి తొక్కలో పీచు, పొటాషియం ఉంటాయి. కీర తొక్కలో పీచు విటమిన్ కె ఖనిజ లవణాలు ఉంటాయి కాబట్టి కీర పై తొక్కతోనే తినాలి తొక్కల్లో ఉండే పోషకాల కోసం వాటిని అలాగే కడిగి తీసుకోవడం అలవాటు చేసుకోవాలి.

Leave a comment