తులిప్ పువ్వులంటేనే అద్భుతమైన అందం . నెదర్లాండ్స్ లోని హాలండ్ తులిప్ పూవులకు ప్రసిద్ధం . ఈ అందాల తులిప్ పూవుల వానలు చూసేందుకు ఎంతో మంది వెళుతూ ఉంటారు . ఐశ్వర్యరాయ్ అంటేనే ప్రపంచ ప్రఖ్యాత అందాల సుందరి . సౌందర్యానికి చిరునామా ఈమె అందమే తులిప్ పువ్వుల అందానికి సాటి అని భావించిన నెదర్లాండ్ పర్యాటక అధికారులు అక్కడ సృష్టించిన డబ్ జాతి తులిప్ రకానికి ఐశ్వర్యరాయ్ పేరు పెట్టారు . ఆ పేరు రిజిస్టర్ చేయించి ఆమెకు కానుకగా అందించారు . ఇప్పుడా పువ్వులు ఆమె పేరుతోనే సౌందర్య నిధులయ్యాయి .

Leave a comment