కరోనా విజృంభణ తీవ్రంగా ఉంది. ఈ సమయంలో రోగనిరోధక శక్తి పెంచుకోవటం చాలా అవసరం అంటున్నారు ఆయుర్వేద నిపుణులు. అమృత వల్లి ఆకులతో చేసిన రసం రోగ నిరోధక శక్తిని భారీగా పెంచుతోందని నిపుణులు చెపుతున్నారు. అమృత వల్లి నీ తిప్పతీగ అంటారు. కొన్ని తిప్పతీగ ఆకులు తులసి ఆకులు,లవంగాలు చిన్న అల్లం ముక్క తీసుకొని నీళ్లలో ఉడికించాలి. బాగా మరిగాక నీళ్లు వడకట్టి నిమ్మరసం కలిపి తాగేయాలి. తిప్పతీగ ఆకుల్లో యాంటీ ఆక్సిడెంట్స్ అధికం బ్యాక్తీరియా తో పోరాడే శక్తిని తెల్లకణాలకు అందిస్తాయి శ్వాసకోశ సంబంధ సమస్యలు తగ్గిస్తాయి. ప్రతి రోజు నాలుగైదు లవంగాలు,అల్లంముక్క,ఈ ఆకులు కలిపిన కాషాయం తప్పకుండ తాగాలి.

Leave a comment