మంచి గుమ్మడి కాయ తో చేసే తియ్యని హాల్వా చాలా బావుంటుంది. అలాగే ఈ గుమ్మడి ముక్కాలా దప్పళం కూడా భోజనాల స్పెషల్. ఏడాది పొడవుగా దొరికే మంచి గుమ్మడి కాయను వింటర్ స్క్వాష్ అని పిలుస్తారు. కాయ పూర్తిగా ఆకు పచ్చ రంగు వదిలి బాగా ఎండి ఎర్రగా అయ్యాకే కోసి వాడతారు . కొంచెం తియ్యని రుచి తో వుండే ఈ గుమ్మడి లో ఎన్నో వెరైటీలు. రోగనిరోధిక వ్యవస్థను బలోపేతం చేసే అద్భుతమైన ఆధారం. ఈ తియ్య గుమ్మడి ప్రీ రాడికల్స్ ను అడ్డు కోగల విటమిన్ సి ఇందులో పుష్కలం క్యాలరీలు చాలా తక్కువ. డైటరీ పీచు చాలా ఎక్కువ. గుమ్మడి గింజల్లో 75 శాతం లినో లిక్. ఓలిక్ యాసిడ్స్ ఉండటం వల్ల తిరుగులేని చిరు తిండిగా పరిగణించబడుతుంది. యాంటీ ఆక్సిడెంట్ సపోర్ట్ ఇస్తుంది. కాన్సర్ డయాబెటిక్ గుండె జబ్బులపై పోరాడే శక్తి నిస్తుంది. శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్ యాంటీ ఇన్ఫలమేటరీ గుణాలు ఉంటాయి. బీటా కెరోటిన్ ఉండటం వల్ల ఆస్తమా రుమటాయిడ్ ఆర్థరైటిస్ ఆస్టియో ఆర్థరైటిస్ ల నుంచి పరిరక్షించడంలో ముందుంటుంది. తియ్య గున్నదిలో చేసే కూడా చాలా బావుంటుంది.
Categories