Categories
ఆనందానికి నిజమైన ఔషధం నవ్వు శారీరకంగా మానసికంగా రిలీఫ్ ఇచ్చేది నవ్వే. నవ్వితే శరీరం మైండ్ రిలాక్స్ అవుతాయి. పాజిటివ్ ఫీలింగ్స్ వస్తాయి. కెరీర్ లో టార్గెట్స్,ప్రస్తుతం విసిగిస్తున్న కరోనా తో పరిస్థితుల్లో సీరియస్ గా ఉండటం వల్ల నష్టమే అంటారు పరిశోధకులు. నవ్వెందుకు పెద్ద ఖర్చేమీ కాదు పైగా ఆ నవ్వు పదిమందికి పంచడం మంచిదే అది మరింత మందికి చేరుతుంది. ఆ కరోనా తో భయాందోళనల్లో ఉన్న సమాజానికి నువ్వు అవసరం ఎంతో ఉంది అంటున్నారు పరిశోధకులు. నవ్వు వచ్చేందుకు సకల ప్రయత్నాలు చేయమంటున్నారు. నవ్వొచ్చే కథలు, నవ్వించే సినిమాలు, జోక్స్ పేల్చే స్నేహితులను అస్సలు వదలొద్దు అంటున్నారు.