మూడు కొవ్వలు కలిపేస్తే పెద్ద యుద్ధం జరుగుతుంది, ఆడవాళ్ళలోనే ఐక్యమత్యం ఉండదనీ దేశమంతా బోల్డు జోకులున్నాయి. ఇప్పుడిది చూడండి. నలుగురు తోడికోడళ్ళు కలిసి ఓ ఏడాదిలో బావి తవ్వి నీళ్ళా కరువు తీర్చారు. అది రాజస్థాన్ రాష్ట్రం ఈ నలుగురు మహిళలు వున్న గ్రామం లామ్ బహాల్డ్. ఇది ఉదయపూర్ కి 130 కిలో మిటర్ల దూరంలో వుంది. స్వాతంత్రం వచ్చి 70 ఏళ్ళు అయినా ఈ వ్యక్తికి ఏ మోక్షము లేదు. నీళ్ళు ఇవ్వండి అని గొంతు పోయేలాగా అరచినా ప్రభుత్వం మొదట వినలేదు. ఈ ఊరులో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు తోడికోడళ్ళు. ఉలి, సుత్తి లాంటి పరికరాలతో మూడేళ్ళపాటు శ్రమ పడి. 40 అడుగుల లోటు 20 అడుగుల వెడల్పు వున్న బావిని తవ్వేసారు. ఇంట్లో మొగాళ్ళు, చుట్టు పక్కల వాళ్ళు వెక్కిరించారు కానీ సాయం మాటకు రాలేదు. మూడేళ్ళు వొళ్ళు విరిగేలా శ్రమ పడితే బావిలో వూట పడింది. గ్రామానికి నీళ్ళు దొరికాయి. కేవలం నలుగురు కోడళ్ళు నిరంతర శ్రమ ఫలితం.

Leave a comment