నెమ్మదిగా చినుకుల రాలు తున్నాయి . వాతావరణంలో వేడి తగ్గుతోంది . ఏదో సమయంలో జల్లుపడితే తడిసిపోవడం ఖాయం . అందుకే కాటన్ వదిలేసి త్వరగా ఆరిపోయే క్రేఫ్ ,షిపాన్ ,సిల్క్ ,పాలిస్టర్ ,నైలాన్ ,వంటి వస్త్రాలకు ప్రాధాన్యం ఇవండీ అంటున్నారు డిజైనర్లు . అవి మీకు వంటికి అతుక్కు పోయేవి కాకుండా కాస్త లూజ్ గా ఉండాలి . గాఫ్ లెన్త్ గౌన్లు ,మినీ స్కర్టులు ,మరీ నేలకు తాకని ప్యాంట్లు సిగవెట్ తులిప్ వంటివి ఎంచుకొంటే సౌకర్యంగా ఉంటాయి . పిస్తా గ్రీన్ ,నీలం ,ఊదా ,పసుపు , పీచ్, ముదురు ఎరుపు ,ఆకుపచ్చ వంటి రంగులు ఎంచుకొంటే మందకొడిగా ఉండే వాతావరణంలో ఉత్సహం తెస్తాయి .

Leave a comment