రష్యన్ మహా రచయిత లియో టాల్ స్టాయ్ రాసిన ప్రతి రచన ఒక కాలానికి సంబంధించినది గా ఉండదు.టాల్ స్టాయ్ రచనలు మానవ చరిత్రలోనే ఉత్తమ కళాఖండాలు అంటారు ఎక్స్పర్ట్స్ . ఇవాన్ ఇలిచ్ మృతి ఒక పెద్ద కథ. ఇవాన్ ఇలిచ్ మంచి ఉద్యోగస్తుడు 5000 రూబుళ్ళ జీతం చక్కని భార్య కుటుంబంతో సంతోషంగా ఉంటాడు. కొత్త ఇంట్లో అలంకరణ కోసం పనిచేస్తూ ఇవాన్ జారిపడి గాయపడతాడు ఆ గాయం తోనే జబ్బు పడి మృత్యు భయంతో ఉన్న ఇవాన్ మానసిక స్థితి ఆలోచనా ధోరణి ఈ సవాల్. జీవితం మొత్తం అబద్ధం తోనే బ్రతికానని ఇవాన్ కి తెలుస్తుంది.చివరికి మృత్యువే అతని దుఃఖాన్ని తీరుస్తుంది తప్పక చదవదగిన నవలల్లో ఇది ఒకటి.