మొహం అలసట వాడిపోయి నిర్జీవంగా యిపోతే క్యారెట్ మాస్క్ ట్రయ్ చేయవచ్చు అంటున్నారు ఎక్స్ పర్ట్స్. జిడ్డు చర్మం తత్వం ఉన్న సాధరణ చర్మతత్వం ఉన్నా ఈ మాస్క్ చక్కగా ఉపయోగపడుతుంది. రెండు క్యారెట్లు నీళ్ళలో ఉడకనిచ్చి చల్లార్చి మెత్తని గుజ్జుగా గ్రైండ్ చేసి ఆ గుజ్జుకు నాలుగు స్పూన్లు తేనె ఒక స్పూన్ ఆలివ్ ఆయిల్ ,కొద్ది చుక్కల నిమ్మరసం కలిపి దీన్ని మాస్క్ లా వేసుకుని ఓ అరగట అలా వదిలేయాలి.ఆ తర్వాత చన్నిళ్ళతో కడుక్కోవాలి.వారానికి మూడు సార్లు ఈ ప్యాక వేసుకోవాలి. క్యారెట్ లో గ్లూకోజ్,ఐరన్,కాఫర్,విటమిన్ ఇ,డి,కే లతో పాటు బీటాకెరోటిన్ ఉంటుంది. ఈ ప్యాక్ తో చర్మం సహజంగా మెరుస్తూ ఉంటుంది.

Leave a comment