Categories
పిల్లలకు ఎదిగే వయసు వచ్చిన దగ్గర నుంచి వాళ్లకు బఠాని గింజంత పేస్ట్ వేసి ఇచ్చి దగ్గరుండి బ్రష్ చేయించాలి . పెద్దవాళ్ళే దగ్గరుండి నాలుగైదు ఏళ్ళు వచ్చేదాకా చూడాలి . వాళ్ళ బ్రష్ లు మృదువైన బ్రిస్టల్స్ కలిగి ఉండాలి . పళ్ళు చిగుళ్ళు కలిసి ఉండే ప్రదేశం దాకా పై నుంచి కిందకు,కింద నుంచి పైకి బ్రష్ కదిలించి తోముకొనే లాగా పిల్లలకు శిక్షణ ఇవ్వాలి . పిల్లలు బ్రష్ నమల కుండా పేస్ట్ తినేయకుండా చూడాలి . తియ్యగా నోటికి తగిలితే తినేస్తారు . నెమ్మదిగా నచ్చజెప్పాలి . నాలుక పై బాక్టీరియా తొలగించు కొనేందుకు టంగ్ క్లినర్ ఉపయోగించు కోవటం నేర్పాలి వేళ్ళతో చిగుళ్ళ పై రుద్ది ,పళ్ళు తోముకోవలసిన అవసరం గురించి చెపుతూ రావాలి . నెమ్మదిగా సొంతంగా అలవాటు చేసుకొనే వరకు ఈ ప్రక్రియ కొనసాగాలి .