రోజు ఆఫీస్ కు ,కాలేజ్ కు వెళ్ళేటప్పుడు పొట్టిగా కత్తిరించిన జుట్టు సౌకర్యంగా బాగానే ఉంటుంది.మరి అదే ఏ ముఖ్యమైన పెళ్ళికో పేరంటానికో కాస్త ప్రత్యేకంగా కనిపించాలి అనుకొంటే ,పూల జడ వేసుకోవాలి. దానికి జడగంటలు వేసుకోవాలి.అందమైన జడబిళ్ళలు అలంకరించాలి అనుకొంటే ఉసురుమంటుంది. జుట్టు ఉంటే కదా ఏ కొప్పు అయినా పెట్టేందుకు? కానీ ఇప్పడా విచారాలు ఏమీ అవసరం లేదు.జుట్టు వత్తుగా కనించాలంటే ఇన్ స్టంట్ వాల్యూమ్ అండ్ థిక్ నెస్ హెయిర్ క్లిప్లు ,టై ఇన్ పోనీ టెయిల్ హెయిర్ ఎక్స్ టెన్షన్లు వచ్చాయి. క్షణాల్లో వీటిని జుట్టు కు తగిలించుకొంటే స్టైల్ బ్రహ్మండంగా ఉంటుంది.

Leave a comment