సుశాంత్ సింగ్ ఆత్మహత్య నేపథ్యంలో దీపికా పదుకొనే దోబారా పూఛో అన్న హ్యాష్ టాగ్ తో ఒక వీడియో పోస్ట్ చేశారు. సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న ఈ వీడియోలో నాలుగు కథలు కనిపిస్తాయి. మానసిక వత్తిడి తో బాధ పడే నాలుగు జంటలు ఎలా తల్లి,తండ్రి భార్య స్నేహితులు ఓదార్పుతో ఎలా ఉపశమనం పొందారో ఈ వీడియో చూపిస్తోంది. నువు వంటరివి కావు అన్న భావన కలిగిస్తే మానసిక ఆరోగ్యం మెరుగుపడుతుంది అంటోంది దీపికా. ఈ ఏడాది దీపికా కు వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ నుంచి ప్రతిష్టాత్మక క్రిష్టల్ అవార్డ్ లభించింది. కుంగుబాటు తో బాధపడే వారిని,దీపికా 2015 లో ఏర్పాటు చేసిన ది లవ్,లాఫ్,ఫౌండేషన్ (TLLLF) ద్వారా మానసిక ఆరోగ్యం పై శిక్షణ శిబిరాలు,అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తోంది.