మధ్యప్రదేశ్ భింద్ జిల్లాలోని అజ్నోల్ గ్రామంలో ఉండే రోష్ని టెన్త్ లో 98.5 శాతం మార్కులు సాధించింది ఈ విజయానికి మొత్తం జిల్లానే మురిసిపోయింది.ఎందుకంటే రోష్ని పడ్డ శ్రమ అంతా ఇంతా కాదు వాళ్ళు ఉండే అజ్నోల్ గ్రామం నుంచి స్కూలు ఉన్నా మెగావ్ గ్రామానికి దూరం 12 కిలో మీటర్లు ప్రతిరోజు ఇరవై నాలుగు కిలో మీటర్లు ఎర్రని ఎండలో ఎడతెరిపి లేని వానల్లో వరదల్లో స్కూల్ కు వెళ్ళింది రోష్ని.వరదల్లో దారి మునిగిపోతే బంధువుల ఇళ్లల్లో ఉండిపోయింది. ఇంత కష్టపడి చదువుకున్న రోష్ని ఐ. ఎ. ఎస్ చదువుతాను అంటోంది.కలెక్టర్ అయి పేదవాళ్లకు మంచి చేస్తానంటోంది. జనాభా, నిష్పత్తిలో ఆడవాళ్ళు తక్కువ ఉన్న జిల్లా భింద్.2011 లెక్కల ప్రకారం బాలురు వెయ్యి మంది ఉంటే బాలికలు 837 మంది. మహిళల్లో అక్షరాస్యత 64 శాతం మాత్రమే ఇలాంటి జిల్లాలో రోష్ని చదువు ఒక విజయంగా చెప్పుకోవచ్చు.