లెహంగా ఎప్పటికీ మారని ఫ్యాషనే. కాకపోతే కాంబినేషన్స్ మారిపోతూ ఉంటాయి. పై నుంచి కింద వరకు హెవీ ఎంబ్రాయిడరీ వచ్చే లెహంగా పైకి ఇప్పుడు కొత్తగా బాలీవుడ్ హీరోయిన్ లు షర్ట్ లు జోడించి దానికి ఆధునికమైన టచ్ ఇచ్చేశారు. ఇది చూసేందుకు హెవీ లాగా లేదు కనుక లెహంగా ఫ్యాషనై పోయింది. పైగా రకరకాల షర్ట్ లు మార్చేస్తున్నారు. కనుక ఎప్పటికప్పుడు సరికొత్త గా ఉంటున్నాయి. మామూలు పార్టీలకు చిన్నచిన్న వేడుకలకు ఇవి సరిగ్గా సరిపోతాయి. ఎప్పటికప్పుడు సరికొత్త గా భిన్నంగా తయారవ్వాలి అనుకుంటారు అమ్మాయిలు సరిగ్గా ఆ ఆలోచన కనిపెట్టినట్లు సండే మండే ఫ్రంట్ బ్యాక్ కుర్తీలు మార్కెట్ లోకి వచ్చాయి. సాధారణంగా కుర్తీలు వెనక ముందు ఒకేరకంగా ఉంటాయి కదా, ఇవైతే ముందొక డిజైన్ వెనకో డిజైన్ ఉంటాయి. ఒకే కుర్తీని ఒక్కసారి ముందుకు ఒక సారి వెనక్కు వేసుకుంటే పూర్తిగా వేరే కుర్తీల్లాగే ఉంటాయి. ఒకవైపు సాదాగా కొన్ని పాచెస్ తో మరో వైపు పూర్తిగా ప్రింటు తో ఉండే ఈ కుర్తీలు అమ్మాయిల హాట్ ఫేవరేట్. అలాగే ఇప్పుడు తాజ్ మహల్ ఫ్యాషన్ బ్లవుజ్ లు వచ్చాయి. చీరకట్టే అమ్మాయిలకు ఇవి ఎంతగానో నచ్చేశాయి కూడా. చీర అంచుకు, దానికి మ్యాచింగ్ గా ఇచ్చిన బ్లౌజ్ అంచుకి తాజ్ మహల్ డిజైన్ చాలా ప్రత్యేకంగా ఉండటంతో పాటు చాలా ఫ్యాషన్ గా ఉన్నాయి కూడా !
Categories