ఓం కాళీ..శ్రీ కాళీ…మహాకాళీ..
ఆషాఢమాసం ఉజైనీ మహాకాళి దర్శనం సర్వరోగ, పాప హరణం.అతి పురాతన చరిత్ర గల అమ్మ ఈ మహాకాళి.
సికింద్రాబాద్ నివాసి అయిన సురుటి అప్పయ్య సైనికుడు.ఉద్యోగరిత్య ఉజైనీ నగరానికి బదిలీ కావడం, ఇక్కడ ప్రజలు మసూచీ(కలరా) వ్యాధితో ప్రాణాలు కోల్పోయారు. ఆ సమయంలో అప్పయ్య అమ్మని కటాక్షించమని ఆలయ నిర్మాణం చేయిస్తానని మొక్కుకున్నాడు.అప్పయ్య మొర ఆలకించి మహాకాళి చల్లని చూపుతో ప్రజల కోరిక మేరకు సికింద్రాబాద్లో అడుగిడి అంగరంగ వైభవంగా పూజలు అందుకుంటోంది.
భద్రాచలంలో రాముల వారి దేవాలయం నాటి నుండి మహాకాళి అమ్మవారి దేవాలయం కూడా వున్నదని చరిత్ర చెబుతోంది. నిత్యం ఉత్సవాలతో అలరారుతూ భక్తుల కోరికలు తీరుస్తూ తన ప్రక్కనే మాణిక్యాంబ దేవితో కూడి పూజలు అందుకుంటోంది జగజ్జనని.
ఇష్టమైన రంగుల:ఎరుపు
ఇష్టమైన పూలు: అన్ని రకముల పూలు.
ఇష్టమైన పూజలు: నిమ్మకాయ దండం,జంతు బలి.
నిత్య ప్రసాదం:కొబ్బరి,పండ్లు,బోనం.
బోనం అలంకరించి మేళతాళాలతో చద్ది సమర్పించాలి.
నమహ్ పార్వతీ పతయే నమో నమః
-తోలేటి వెంకట శిరీష