Categories
ప్రియాంక చోప్రా ఆత్మకథ అన్ ఫినిష్డ్ అనే పేరుతో రావబోతుంది. ఈ పుస్తకం కవర్ పేజీ ఇన్ స్ట్రా గ్రామ్ లో పెట్టింది ప్రియాంక.నేను ఎప్పటి నుంచో పుస్తకం రాయలనుకున్నాను కానీ చాలా పనుల్లో త్వరగా పూర్తి చేయలేకపోతున్న .సాధించవలసింది చాలా ఉంది.జీవించవలసింది కూడా ఉంది.నేను ఒక పబ్లిక్ పర్సనాలిటీని ,నన్ను చూసి నేను గర్వించేంతగా పని చేశాను. కథ ముగింపు లేనిది కదా, జీవితంలో గొప్ప పాఠాలు ప్రయాణం సాగుతున్నప్పుడే నేర్చుకొంటాం,తెలుసుకొంటాం అంటోంది ఈ పుస్తకంలో ప్రియాంక .నటి ,నిర్మాత ,సామాజిక కార్యకర్త , యూనిసెఫ్ రాయబారి గా ఆమె ప్రయాణం విశేషాలన్నీ అన్ ఫినిష్డ్ పుస్తకంలో ఉన్నాయి.