ఎడ్యుకేషన్ లో ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించే ఇదన్ అవార్డ్ అందుకున్నారు డాక్టర్ రుక్మిణి బెనర్జీ. ముంబై కేంద్రంగా పనిచేస్తున్న ‘ప్రథమ్ లో పనిచేస్తూ విద్యా వ్యవస్థ అభివృద్ధే లక్ష్యంగా పని చేస్తున్నారు. బెనర్జీ నేతృత్వంలోని బృందం యాన్యువల్ స్టేటస్ ఆఫ్ ఎడ్యుకేషన్ రిపోర్ట్ తయారు చేశారు. గ్రామీణ ప్రాంతాల్లో ఆరు లక్షల మంది పిల్లల అక్షరాస్యత నాణ్యత పై జరిపిన సర్వే రిపోర్ట్ అది ఈ కృషి కి గుర్తింపుగా రుక్మిణి కి ‘యిదన్’ ప్రైజ్ వరించింది. ఈ బహుమతి పొందిన వారికి స్వర్ణ పతకంతో పాటు 29 కోట్ల రూపాయల డబ్బు ఇస్తారు ఇందులో సగం విద్యాభివృద్ధికి ఉపయోగించాలి.