హేమ బాలకృష్ణన్ ఒక సారి అందమైన ఎర్రమట్టితో చేసిన ఒక ఆభరణాన్ని కలర్ ది ఎర్త్ పేరుతో బొటెక్ లో పెట్టారు. ఆ ఆభరణం చక్కగా ఉండటం చూసి చాలా మంది కొనేందుకు వచ్చారు. ఇలాంటి వ్యాపారం విస్తరింపజేస్తే బావుంటుందని చిన్న చిన్న రిటైల్ షాపులు ఏర్పాటు చేసి కలర్ ది ఎర్త్ పేరుతో 2013లో ఇ-కామర్స్ స్టోర్ ఏర్పాటు చేశారు. ఈ కలర్ ది ఎర్త్ ద్వారా టెర్రికోటా కళాకారులు 200మంది ఉపాధి పొందుతున్నారు. ఈ టెర్రకోట ఆభరణాల అందం చూడాలంటే కలర్ ది ఎర్త్ ఫేస్ బుక్ పేజీ ఓపెన్ చేయవచ్చు.