లంఖణం పరమౌషదం అంటారు ఆయుర్వేద నిపుణులు. అలాగే చాలా మందికి ఎంతో మంది దేవుళ్ళ పేరిట ఒక్కపూట ఉపవాస నియమం వుంటుంది. ఇక పూజల్లో భాగంగా చేసే ఉపవాసాలు సరేసరి. భారతీయ జీవన విధానం లో ఉపవాసం నియమం గా ఉంది. ఇప్పుడు కొత్త పరిశోధనలు ఇది నియమంగా చేసిన, ఆరోగ్యం కోసం చేసిన మంచి ఫలితాలే వున్నాయంటున్నాయి. తక్కువ మొత్తంలో ఆహారం, ఉపవాసం దీక్ష లో తీసుకునే పళ్ళు పాలు శరీరానికి ఉపయోగం అంటున్నారు. వరం లో కనీసం ఒక్క రోజైనా పూర్తిగా ఏమీ తినక పొతే శరీరం కాస్త  తనను, తన వ్యావస్థను వాగు చేసుకుంటుంది అని, నిజానికి ఉపవాసం వున్నా ఉదయం తేలికగా వుండటం, నీరసంగా వుండటం గమనిన్చుకోమని చెప్పుతున్నాయి. ఇలా ఉపవాస కారణంగా, ఆరోగ్యంగా యవ్వనం తో కూడా ఉంటారని వాళ్ళ రిపోర్టు. ఒక్క పూట తినకపోతే ఆ సమయం శరీరం ఉపయోగించుకుంటుందని , కేవలం నీళ్ళు మాత్రం తాగటం వల్ల చెర్మం తేటగా ఉంటుందని చెపుతున్నారు. ఏ విధంగా చుసినా,ఇటు భక్తి తో చేసినా, ఆరోగ్యం కోసం చేసినా ఉపవాసం వల్ల లాభమే.

Leave a comment