ఎప్పుడూ పువ్వులూ, ఎంబ్రాయిడరీలు, కట్ వర్క్ డిజైన్స్ వైపే చూస్తారు కానీ పూర్తిగా ప్లెయిన్ డ్రెస్సుల్లో ఎంత అందంగా వుండోచ్చో కొంత మంది హీరోయిన్స్ ని చుస్తే అర్ధం అవుతుంది. కాకపొతే అంచులలో చిన్న డిజైన్లు, కనిపించని బుటీలు, బ్లాక్ ప్రింట్ కలిపి సాదా చీరలకు గొప్ప అందం వస్తుంది. దానికి  జతగా మెడ ప్రేత్యేకంగా కుట్టించుకున్న బ్లవుజు కూడా చీర అందానికి మాచ్ అవుతుంది. అలాగే చీరకు తగ్గట్టు ఇతర వస్తువులు డిజైనర్ తరహగా వుండాలి. ఎంబ్రాయిడరీ చేసిన అందమైన బ్యాగులు, క్లచ్ పర్సులు, మెటాలిక్ యాక్ససరీలు, తేలికైన నగలు వేసుకోవాలి. ఇలాగె సాదా చీరలు సాంప్రదాయ వర్ణాలతో వుండే లాగా చూసుకోవాలి. పౌడర్ బ్లూ, పసుపు, ఐస్ బ్లూ, పీచ్, సముద్ర నీలం వంటి లేలేత ఛాయలు ఎంచుకుని, సిల్క్, శాటిన్, కాటన్, సిల్క్,జార్జెట్, వంటి వస్త్ర శ్రేణిలో చీరలుంటే సంప్రదాయకంగా, అటు మోడ్రెన్ గా వుంటాయి. ఇలాంటి హంగులు లేకుండా కేవలం ఒక్క రంగుతో నే ఎంతో అందంగా కనిపిస్తారు. అయితే దుస్తుల ఎంపిక, దానికి జతగా బ్లవుజ్ నగల మేళవింపు వుంటే చాలు. ఏ పార్టి, అకేషన్ లో అయినా మెరిసిపోవచ్చు. ఇమేజస్ చుస్తే కొంత మంది హీరోయిన్ ఎంచుకున్న కాంబినేషన్స్ నగల పద్దతి అర్ధం అవుతుంది. పైగా వేసవికి లేత రంగుల సాదా చీరలు ఎంతో అందం.

Leave a comment