ఆ ఊరి పేరు మయూర్ విహార్ . ఆవూరినిండా నెమళ్ళే ,ఆ గ్రామీణులు,నెమళ్ళు కలిసే జీవిస్తారు ఊరిని సొంతిల్లుగా భావించి నెమళ్ళు హాయిగా తిరుగుతాయి . ఇళ్ళు ,పిట్టగోడలు ,ఎక్కడిపడితే అక్కడ పురివిప్పి ఆడతాయి . ఇది మాధోపూర్ గోవింద్ గ్రామం చంపాడన్ జిల్లాలో ఉంటుంది . అలాగే బీహార్ లోని సహారా జిల్లాలోని అరుణ్ గ్రామంలో ను ఎన్నో నెమళ్ళు ఉంటాయి . వీటిని చూడటం కోసం ఈ మధ్య రాష్ట్ర ముఖ్యమంత్రి అటవీ అధికారులు ఈ ఊరిని సందర్శించారు . వెదురు పొదలు ,చెట్లతో నిండిన ఈ వాతావరణం నెమళ్ళు సంతానోత్పత్తికి అనువుగా ఉందని సంతోషం వ్యక్తం చేశారు . గ్రామీణులు ఈ నెమళ్ళు కోసం ఎన్నో ఆవాసాలు ఏర్పాటు చేశారు . మయూర్ విహార్ గ్రామంలో వాటికోసం గ్రామీణులు చెరువుతవ్వారు . ఇలాటి వాళ్ళు ఉండబట్టే జీవజాతులు బతక గలుగుతున్నాయి .

Leave a comment