ఆసియాలో అత్యంత పరిశుభ్రమైన గ్రామం మాలివాంగ్ . బంగ్లాదేశ్ సరిహద్దుకు దగ్గరలో ఉంటుంది . చిరపుంజు నుంచి మూడుగంటల ప్రయాణం అన్నమాట . దారిలో ఒక్క కాగితం ముక్క కూడా కనిపించదు . ప్రతిచోట అందమైన చెత్త బుట్టలు చెత్తకోసం ఏర్పాటు చేశారు . సందర్శకులు గ్రామం బయట నుంచి స్కై వాక్ ద్వారా రావచ్చు . చెత్తవేళ్ళు ,కొమ్మలు ,జూట్ తో అల్లిన వంతెన ఇది . స్థానికంగా నివసించే వాళ్ళు ,ఈ బ్రీడ్జి ని శతాబ్దాలుగా అల్లుతూ వచ్చారు . దాన్ని లివింగ్ రూట్ బ్రిడ్జి అంటారు . అడవిలో వెళ్లేందుకు సులువైన మార్గం . రబ్బరు చెట్ల తో తయారుచేసే ఈ లివింగ్ రూట్ బ్రిడ్జి లు ఈ రాష్ట్రంలో ఎన్నో చోట్ల ఉన్నాయి

Leave a comment