నా దగ్గర శిక్షణ పొందుతున్న ఎంతో మంది పిల్లల్లో ఒక్కరైనా ఒలంపిక్స్ బరి లో నిలవాలని నా ఆశయం బాక్సర్ గా ఒలంపిక్స్ పతాకం గెలవాలన్న నా కోరిక అలాగే ఉండిపోయింది. కనీసం కోచ్ గా అయినా ఎంతో మంది విజేతలను తయారు చేయాలనుకొన్నాను అంటున్నారు ఉషా. తాజాగా ధ్యాన్ చంద్ అవార్డ్ ని గెలుచుకొన్నారామె అఖిల భరత్ రైల్వే మహిళల జట్టుకు కోచ్ గా ఉన్నారు.ప్రస్తుతం నగరంలో డీజల్ లోకోషెర్ గ్రేడ్-1 ఉద్యోగిగా విధులు నిర్వహిస్తున్నారు ప్రపంచ మహిళల బాక్సింగ్ లో రెండు రాజితాలు,ఆసియా ఛాంపియన్ షిప్ లో స్వర్ణం గెలుచుకున్నారు. జాతీయ స్థాయిలో ఏడేళ్ల పాటు ఛాంపియన్ గా నిలిచారు.