Categories
![](https://vanithavani.com/wp-content/uploads/2023/08/Lethukukhanya-Mjaji.jpeg)
దక్షిణాఫ్రికా లోని మారుమూల గ్రామంలో పుట్టిన మూడేళ్ల లేతుకుఖాన్య మ్జాజీ అల్బానీ బ్రెడ్ కంపెనీ బ్రాండ్ అంబాసిడర్ అయింది.అమ్మ వద్దన్నా ఏడ్చి మరీ బ్రెడ్ ప్యాకెట్ కొనుక్కునే పాప మొహంలో ఆనందం చూసి ఆమె మామ లుంగీసా జాజి ఫోటో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు.గంటల్లో ఆ ఫోటో వైరల్ అయ్యి ఇంత ఆనందించే పాపను మీ సంస్థ బ్రాండ్ అంబాసిడర్ గా పెట్టుకోమని లక్షలమంది ట్రీట్ చేశారు దాంతో ఆ కంపెనీ వాళ్ళు ఇంతకుముందు వేరే ఫోటోలతో ఉన్న బ్రెడ్లను కూడా వెనక్కి తీసుకుని లేతుకు ఫోటోతో ప్యాకింగ్ చేసి మార్కెట్లోకి తెచ్చారు.చింపిరి జుట్టుతో మాసిపోయిన దుస్తులతో ఉన్న లేతుకు కాస్తా సెలెబ్రెటీ అయింది.