Categories
కరోనా వ్యాక్సిన్ వేయించుకున్న క్రిస్టీన్ డువల్ లక్కీ డ్రా లో 2 మిలియన్ డాలర్లు గెలుచుకుంది. అమెరికా కు చెందిన క్రిస్టీన్ జీవితం కరోనా వ్యాక్సిన్ తో మారిపోయింది. కోవిడ్ వ్యాక్సిన్ ను వేయించుకునేలా ప్రోత్సహించేందుకు అమెరికాలోని మిషిగన్ లో గత జూలై 1 నుంచి 30 వరకు ఒక పథకాన్ని ప్రారంభించారు. అందులో భాగంగా ఎంపికైన వ్యక్తి కి రెండు మిలియన్ డాలర్లు బహుమతి ప్రకటించారు ఆవిధంగా వ్యాక్సిన్ వేయించుకొని లక్కీ డ్రా లో ఎంపికై బహుమతి గెలుచుకుంది క్రిస్టీన్.