Categories
వ్యాక్సిన్ సమర్థవంతంగా పని చేయాలంటే వ్యాక్సిన్ కు ముందు తర్వాత కొన్ని ఆహార నియమాలు పాటించాలి.వ్యాక్సిన్ తీసుకోబోయే ముందు నీళ్లు ఎక్కువగా తాగాలి సరిపడా హైడ్రేషన్ తో సైడ్ ఎఫెక్ట్స్ తీవ్రత తక్కువగా ఉండే వీలుంది. శాచ్యురేటెడ్ ఫ్యాట్స్ ఉండే జింక్ ఫుడ్ తక్కువగా పీచు ఎక్కువగా ఉండే పోషకాహారం తీసుకోవాలి. ఆహారంలో పీచు శరీరాన్ని రిలాక్స్ గా ఉంచడంతో పాటు వ్యాధినిరోధక శక్తి బలపరుస్తుంది.ఒత్తిడికి నిద్రలేమికి కారణం అయ్యే తీపి పదార్థాలకు దూరంగా ఉండాలి. కొబ్బరి నీళ్లు మజ్జిగ తాజా పండ్ల రసాలు ఎక్కువగా తీసుకోవాలి. వ్యాక్సిన్ తీసుకొన్నాక తేలికగా అలసటకు గురి చేసే వేడి వాతావరణానికి దూరంగా ఉండాలి.