Categories
WoW

వాడేసిన పొడితోనూ ఉపయోగాలు

కొత్తగా వంటిల్లు స్వాధీనం చేసుకుని దాన్ని తాజ్ మహల్లా తీర్చి దిద్దుదామనుకునే వాళ్ళ కోసం కొన్ని చిట్కాలు పైగా పారేసే తుక్కులాంటి మెటీరియల్. వాడేసిన టీ పొడి ఎలాగా పారేసే బదులు దాన్ని నీళ్లలో కలిపి మొక్కలకు పోస్తే మొక్కలకు ఫంగల్ ఇన్ఫెక్షన్లు రాకూండా ఉంటాయి. అలాగే వంటింట్లో చెత్త డబ్బాలో వాడేసిన టీ పొడిని టీ బ్యాగ్స్ ని పడేస్తే అది దుర్వాసన రాకుండా చేస్తుంది. టీ పొడి కప్పులోకి తీసుకుని దానిపైన లావెండర్ గాని గులాబీ నూనె కానీ పోసి ఓ మూల పెడితే కాస్సేపటికి ఇల్లంతా సువాసనే. జిడ్డుగా ఉన్న పాత్రల్ని టీ పొడి కలిసిన నీళ్లతో పడేస్తే తోమటం ఈజీ. ఈ వాడిన టీ పొడి పారేయకుండా ఎండబెట్టి ఓ బౌల్ లో వేసి కిచెన్ సింక్ గట్టున పెట్టేయండి. చేపలు ఉల్లిపాయలు వెల్లుల్లి వంటి గాఢమైన వాసన చేతులకు జారుకుంటుంటే ఈ పొడితో తోమితే వాసన మాయం . అద్దాలు కిటికీలు గాజు వస్తువుల పై మురికి పేరుకుంటే ఈ టీ పొడి నీళ్లలో పడేసి ఆ నీళ్లతో వీటిని శుభ్రం చేయచ్చు.

Leave a comment