గృహాలంకరణ కోసం ఉపయోగించే పల్సటిక్ పూల తయారీలో చైనా థాయిలాండ్ కి  మంచి పేరుంది. ఈ కృత్రిమ పువ్వులు ఇదివరలో గులాబీలు డైసీ లు లిలియాక్ లు పాయిం సెట్టియటాలు వంటి విదేశీ జాతులు ఎక్కువగా ఉండేవి. ఇప్పుడీ కృత్రిమ పువ్వుల్లో  మన పెరటితోటల్లో కనిపించే బంతి చామంతీ నందివర్ధనం గన్నేరు కనకాంబరాలు మల్లెలు రాధ మాలతీలు చేరాయి. ఈ పువ్వుల్ని పువ్వుల చెట్లని చాలా పల్చగా అంతుపట్టలేనంత సహజంగా తయారుచేస్తున్నారు. వట్టి కొమ్మలు పువ్వులే కాదు ఆ పూవుల్లో సౌరభాలు కూడా యధాతధంగా వచ్చేలా తయారుచేస్తున్నారు. వీటితో పాటు ఆఫీస్ ప్రాంగణాల్లో పెరిగే మర్రి రావి కొబ్బరి వేప తాటి వంటి మొక్కలు కూడా కృత్రిమంగా రూపొందిస్తున్నారు. కొమ్మలు ఆకులు పూరేకుల సుకుమారం కూడా సహజత్వం ఉట్టిపడుతోంది. గృహాలంకరణ కోసం ఈ పూల మొక్కలు ఎంత బావున్నాయో.

 

 

 

Leave a comment