మొక్కలను పెంచుకోవాలంటే ఇంటి ముందు స్థలం ,బాల్కనీలే అవసరం లేదు ఇంటి కిటికీలు చాలు, ఇల్లు పూవ్వుల తోటలా మార్చేయవచ్చు అంటున్నారు గార్డెనింగ్ ఎక్స్ పర్ట్స్. కిటికీల కిందుగా రాడ్స్ ఏర్పాటు చేసుకొని కుండలు అమర్చుకొంటే మనకు ఇష్టమైన పరిమళాలు వెదజల్లే మాచిపత్రి వంటి మొక్కల్ని పెంచుకోవచ్చు . ఈ కుండీల్లో మట్టి కన్నా పీట్ మాస్ ,చెట్టు బెరళ్ళు,పీచు ఇంకా ఖనిజాలు వేసిన విశ్రమంతో నింపితే మొక్కలు ఇంకా బలంగా ఆరోగ్యంగా పెరుగుతాయి. సీజనల్ గా బంతి ,చామంతి,చంద్రకాంతి,శంఖు పూలు,బిళ్ళ గన్నేరు ఇవన్నీ కిటికీలను గొప్ప అందంతో నింపేస్తాయి . పూవ్వుల మొక్కల మధ్యలో క్రొటన్స్ పెంచితే ఇంక ఇంటికి అందం.

Leave a comment