వ్యాయామం చేయాలని అంతులేని కోరిక ఉన్న సరే ఎంతో బిజీ షెడ్యూల్స్ మధ్యన లేదా బద్ధకం కొద్దినో వాయిదాలు వేసే వాళ్ళు ఒక ప్రయోగం చేయండి సక్సెస్ అవుతారు అంటున్నారు ఎక్స్ పర్ట్స్. పిల్లల టైం టేబుల్ ల్లాగా వర్కవుట్ షెడ్యూల్ చేసుకోవాలి .దాన్నీ అంటిపెట్టుకొని ఉండాలి. ఉదయం 5:30 గంటలకు అనుకుంటే ఆ సమయంలో లేచి తీరాలి. ఒక వేళ ఇవ్వాళ కుదరకపోతే సరిగ్గా ఆ సమయానికి రేపు ప్రారంభించాలి .అలాగే సమయం సరిపోకపోతే అరగంట సమయాన్నీఐదు నిమిషాలకైనా కుదించి వ్యయామం చేయాలి.ఆనాటి పనుల జాబితాలో ఈ ఐదు నిమిషాలు సంతృప్తి కలిగిస్తే ఆ సమయంలో మన ఆరోగ్యం కోసం ఖచ్చితంగా రెగ్యులర్ వ్యాయామం అలవాటైపోయినట్లే .దొరికిన కొద్ది సమయం అయినా వ్యాయామం చేసి మిగతా పనివైపు వెళ్ళాలని మైండ్ ఫిక్సాయిపోతుంది.

Leave a comment