పెళ్లి ఏదైనా స్పెషల్ అకేషన్ వస్తే డ్రెస్ లు డిజైన్ చేయించుకోవటం దానికి జ్యూవెలరీ ఏం బావుంటుందో చూసుకోవటం ఇవన్నీ  అమ్మాయిలు ఒక్కటీ వదలరు . ప్రత్యేకంగా అన్నీ ఉండాలి. ప్రత్యేకంగా కనిపించాలి. మరిన్ని స్పెషల్ గా ఉంటె చెప్పులు మాత్రం ప్రత్యేకంగా ఉండద్దా !! అందుకే ఈ వెడ్డింగ్ షూస్ ఐడియాస్ యాప్. ఇందులో ఎన్నో చెప్పుల వరసలు డిసప్లే వుంది. కానీ ఇందులో ఓ ప్రత్యేకత వుంది. ఏ ముచ్చటైన డిజైన్లతో రౌండ్ టో  వెడ్డింగ్ ఫ్లిప్ ఫ్లాప్స్ బాలే పంప్స్ ఇలా బోలెడన్ని రకాలున్నాయి కదా. అయితే వీటిలో ఎదో ఒకటి ఎంచుకునే పనిలేదు. అందమైన రంగుల్లో అందుమీద మెరిసే రాళ్లు  జర్దోసీలు లేస్ లు ఇవన్నింటిలో డిజైన్ చేసిన చెప్పుల్ని హీల్ ఇంకాస్త పెద్దదిగా ఉండాలంటే ఫలానా డిజైనర్ చెప్పులు ఫ్లాట్ గా వుండాలనో లేదా ఫలానా రకం రాళ్ళుఉంటే చీరకు మ్యాచవుతుందనో మన ఇష్టాలు చెపితే అలా  తయారై వస్తాయి. వున్నవాటి గురించిన సమాచారం ఇచ్చారు.ఏవీ నచ్చకపోతే మన సొంత డిజైన్ చెప్పేస్తే సరి!!

Leave a comment