గుడి కట్టి పూజించేంతమంది అభిమానులను దక్కించుకోవటం కొంత మంది హీరోయిన్లకే దక్కింది. ఆ కొద్దీ మందిలో హన్సిక పేరు కూడా ఉంటుంది. ఒకప్పుడు కోలీవుడ్ లోఒకేసారి ఐదారు సినిమాలు చేసిన హన్సిక ఇప్పడూ ఒకే ఒక్క సినిమా చేస్తోంది. ఈ విషయం అడిగితే హన్సిక ఈ హవాలు జోరు అన్న పదాలు నేను నమ్మను. ఐదారు స్క్రిప్టులు చేస్తూ బిజీ గా ఉన్నా ఇప్పుడు ఒక్క సినిమా చేస్తున్నా అవన్నీ అప్పటికప్పుడు ఒప్పుకున్నవేవీ కాదు. ఎప్పుడో ఒప్పుకుని ఎప్పుడో చేసేవి. అంతే తప్ప ఏ హీరోయినూ ఒకేసారి నాలుగైదు సినిమాలు చేయరు. కొంత కాలం క్రితం ఒప్పుకున్న తెలుగు సినిమాలు ఇప్పుడు మొదలయ్యాయి. పైగా స్టార్ హీరోలు చిన్న హీరోలు యువ కధానాయకులా అని నేనెప్పుడూ ఆలోచించలేదు. కధ నచ్చితేనే సినిమా. నా అభిమానులు నొచ్చుకోకుండా ఉండేటట్లు కథలుంటే బావుండనుకుంటా. ఇప్పుడు నాకు ఫేస్ బుక్ అభిమానులే 60 లక్షల మంది ఉన్నారు. ఇంతమంది మనసులో నాకు స్థానం ఉండటం కంటే ఇంతకంటే కోరుకునేది ఏముంటుంది? నేనెప్పుడూ సక్సెసే అనుకుంటానంటోంది హన్సిక. చిన్న వారులో సినిమాలోకొచ్చాను. ఇది పూర్తిగా నా లైఫ్ అనిపిస్తూ ఉంటుంది. సినిమాలేని రోజుని నేనెప్పటికీ ఊహించలేనంటోంది హన్సిక.
Categories
Gagana

ఎప్పుడో ఒప్పుకున్న సినిమాలిప్పుడు మొదలయ్యాయి

గుడి కట్టి పూజించేంతమంది అభిమానులను దక్కించుకోవటం కొంత మంది హీరోయిన్లకే దక్కింది. ఆ కొద్దీ మందిలో హన్సిక పేరు కూడా ఉంటుంది. ఒకప్పుడు కోలీవుడ్ లోఒకేసారి ఐదారు సినిమాలు చేసిన హన్సిక ఇప్పడూ ఒకే ఒక్క సినిమా చేస్తోంది. ఈ విషయం అడిగితే హన్సిక ఈ హవాలు జోరు అన్న పదాలు నేను నమ్మను. ఐదారు స్క్రిప్టులు చేస్తూ బిజీ గా ఉన్నా ఇప్పుడు ఒక్క సినిమా చేస్తున్నా అవన్నీ అప్పటికప్పుడు ఒప్పుకున్నవేవీ కాదు. ఎప్పుడో ఒప్పుకుని ఎప్పుడో  చేసేవి. అంతే తప్ప ఏ  హీరోయినూ ఒకేసారి నాలుగైదు సినిమాలు చేయరు. కొంత కాలం క్రితం ఒప్పుకున్న తెలుగు సినిమాలు ఇప్పుడు మొదలయ్యాయి. పైగా స్టార్ హీరోలు చిన్న హీరోలు యువ కధానాయకులా అని నేనెప్పుడూ ఆలోచించలేదు. కధ నచ్చితేనే సినిమా.  నా అభిమానులు నొచ్చుకోకుండా ఉండేటట్లు కథలుంటే బావుండనుకుంటా. ఇప్పుడు నాకు ఫేస్ బుక్ అభిమానులే 60 లక్షల మంది ఉన్నారు. ఇంతమంది మనసులో నాకు స్థానం ఉండటం కంటే ఇంతకంటే కోరుకునేది ఏముంటుంది? నేనెప్పుడూ సక్సెసే  అనుకుంటానంటోంది హన్సిక. చిన్న వయస్సులో సినిమాలోకొచ్చాను. ఇది పూర్తిగా నా లైఫ్ అనిపిస్తూ ఉంటుంది. సినిమాలేని రోజుని నేనెప్పటికీ ఊహించలేనంటోంది హన్సిక.

Leave a comment