ఏ మారుమూల అడ్రస్ ని అయినా సరిగ్గా చూపగలిగే ‘పతా’ యాప్ తయారు చేసింది కృతిక జైన్. ఇండోర్ కు చెందిన కృతిక న్యూయార్క్ యూనివర్సిటీ లో మేనేజ్మెంట్ టెక్నాలజీ లో మాస్టర్స్ చేసింది. చదువు లో భాగంగా న్యూయార్క్ లో ఉన్న కాలంలో అక్కడి రోడ్ల అడ్రస్ తెలిపే మార్కింగ్ ఎంతో ఆకర్షించాయి. ఇండియా వచ్చి పతా యాప్ సృష్టించింది. డిజిటల్ అడ్రస్ రూపొందించే ‘పతా’ యాప్ ప్రతి ఇంటి అడ్రస్ కు ఒక కోడ్ ను ఇస్తుంది. ఈ యాప్ కోడ్ తో పాటు మన వాయిస్ కూడా అడ్రస్ డైరెక్షన్స్ ఇచ్చే అవకాశం ఇస్తుంది. గత ఏడాదే అడ్రస్ నేవిగేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ స్థాపించి యాప్ అందుబాటులోకి తెచ్చింది. కృతిక జైన్ ఇందులో ఈమెకు రజిత, మోహిత్ జైన్ అనే ఇద్దరు సహ వ్యవస్థాపకులున్నారు.

Leave a comment