బెంగళూర్ కు చెందిన నాగరత్నమ్మ 62 ఏళ్ల వయసులో పశ్చిమ కనుమల్లో అగస్త్య కూడమ్ పర్వతాన్ని కొడుకు అతని స్నేహితులతో కలసి ఎక్కేసి చరిత్ర సృష్టించారు. ఆ పర్వతం ఎత్తు ఆరు వేల అడుగుల కంటే ఎక్కువే చీరకట్టుతో తోనే నాగరత్నమ్మ ఆ పర్వతాన్ని ఎక్కేసి సామాజిక మాధ్యమాల్లో ప్రశంసలందుకున్నారు. ఈ పర్వతారోహణ నాలో కొత్త శక్తి నింపింది. నేను మరిన్ని పర్వతాలు ఎక్కేసి నా నా చిన్నప్పటి నుంచి అనుకున్న ఈ ట్రెక్కింగ్ కోరికను తీర్చుకుంటాను అంటున్నారు నాగరత్నమ్మ. కల ఉంటే చాలు. అదే లక్ష్యం వైపు నడిపిస్తుంది అని చెప్పేందుకు ఈమె చక్కని ఉదాహరణ.

Leave a comment