లిప్ స్టిక్ వాడే ఎంతోమంది లిప్ లైనర్ ప్రయోజనం గురించి ఆలోచించకుండా నేరుగా లిప్ స్టిక్ తో పెదవులు నింపేస్తారు పెదవుల అందాన్ని లిప్ లైనర్ మెరుగుపరుస్తుంది అంటున్నారు ఎక్సపర్ట్స్. లిప్ లైనర్ తో పెదవులు సహజసిద్ధ అవుట్ లైన్ స్పష్టంగా కనిపిస్తుంది. లిప్ స్టిక్ చెక్కుచెదరకుండా ఉంటుంది. క్రీమీ లిప్ స్టిక్, లేదా లిప్ గ్యాస్ ఏది వేసుకొన్న మరింత ఆకర్షణీయంగా కనిపించేందుకు లిప్ లైనర్ తోడ్పడుతుంది. కనుక పెదవుల అంచులు ఎలివేట్ అవ్వటం కోసం షేపింగ్ లిప్ లైనర్ లిప్ స్టిక్ చెదరకుండా ఉండటం కోసం క్రీమీ పిగ్మెంట్డ్ లిప్ లైనర్ వాడుకోవాలి. పెదవుల చివర్ల నుంచి మొదలుపెట్టి మధ్యలో లిప్ లైనర్ ను కదిలిస్తూ లిప్ ఔట్ లైన్ గీసుకోవాలి. ఆ తర్వాత లిప్ స్టిక్ వేసుకుంటే పెదవులు అందంగా ఉంటాయి.

Leave a comment