లండన్ కు దాదాపుగా 600 కిలో మీటర్ల దూరంలో  ఉంది ఐర్లాండ్.  అక్కడ ముఖ్యమైన పంట బార్లీ, రాగులు అక్కడి ఆడవాళ్ళు వీటినే సౌందర్య పోశాకాలుగా మలుచుకున్నారు. ఇక్కడి ఆడవాళ్ళు బార్లీ నీళ్ళు తాగుతారు. బార్లీ గింజల్ని వేయంచి పొడి చేసి నీళ్ళలో ఈ పొడిని కలిపి మరిగిస్తారు. తర్వాత నిమ్మరసం పిండుతారు. ఇందులోని యాంటీ ఆక్సిడెంట్లు, సెలీనియం వంటి పోషకాలు  చర్మాన్ని బిగుతుగా చేసి వృద్దాప్యా ఛాయల్ని రానివ్వవు. అలాగే ఈ పొదిలో తేనె నిమ్మరసం కలిపి మొహానికి పూతగా వేసుకుంటారు. అలాగే రాగుల్ని నీటిలో కాచి చల్లార్చి, ఆ నీళ్ళతో ముఖం శుబ్రం చేసుకుంటారు. ఇందులోని యాంటీ ఆక్సిడెంట్స్ చర్మానికి మెరుపును ఇస్తాయి. రాగుల పిండిని పల్చగా కలిపి మొహానికి పూటలా వేసుకుంటారు. ఇది చాలా మంచి ఫేస్ ప్యాక్ అని చెప్పుతారు.

Leave a comment